అంగన్వాడీ టీచర్లు జాతి నిర్మాతలు
బీజేపీ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్
అంగన్‌వాడీ టీచర్లు జాతి నిర్మాతలని బీజేపీ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మరియు ఆయాలకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలకు ప్రీస్కూల్ విద్య, ఆటపాటలతో బుద్ధి వికాసం, గర్భిణీ లకు బాలింతలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు అందించే అంగన్వాడీల సేవలు ఎంత కొనియాడినా తక్కువేనన్నారు. ఒక వ్యక్తి ఇంజనీర్ గా, డాక్టర్ గా, సైంటిస్ట్ గా ఒక కలెక్టర్ గా ఎదగాలంటే ముందుగా పునాది అంగన్వాడీలే అని కొనియాడారు.
భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అంగన్వాడీలను పోషణ్ అభియాన్లో భాగం చేశారని వారికి ఇన్సూరెన్స్, స్మార్ట్ ఫోన్లు అందించారని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు తక్కువ ఉన్నా వారి సేవలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాన్ని పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SC మోర్చ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు ముల్కళ్ల కుమార్, నరేందర్, రజిత, శ్రావణి, పద్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.