ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబ‌డి ఉంది

మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఆయ‌న మంచిర్యాల‌లో మాట్లాడుతూ తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU), INTUC కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో కార్మికులు బాణం గుర్తుపై ఓటు వేసి TWU–INTUC కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.  ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

“కాంగ్రెస్–INTUC–TWU కూటమికి కార్మికులు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ తక్షణమే చేపడతాం” అని మంత్రి వివేక్ వెంకటస్వామి మరోసారి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేసి కార్మికులకు అందించామన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు భవిష్యత్తులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుంటుందని వివేక్‌ స్పష్టం చేశారు. మంచిర్యాల ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు బాణం గుర్తుపై ఓటు వేసి TWU–INTUC అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వివేక్ కోరారు.

You might also like