SIR పేరుతో ఓట్ల తొలగింపును ఆపాలి

SIR పేరుతో ఓట్ల తొలగింపును ఆపాలని CEC జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని సీఐటీయూ మంచిర్యాల సహాయ కార్యదర్శి దాగం రాజారాం డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధం ఆపాల‌ని అన్నారు. సీఐటియూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాండూరు మండల కేంద్రంలోని ఐబి జాతీయ రహదారిపై ధర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఐటీయూ మంచిర్యాల సహాయ కార్యదర్శి దాగం రాజారాం, వ్యవసాయ కార్మిక సంఘం తాండూరు మండల అధ్యక్షులు వేల్పుల శంకర్ మాట్లాడుతూ సర్ పేరుతో 13 కోట్ల మందికి పైగా ఓట్లను ఏకపక్షంగా తొల‌గించ‌డం దారుణ‌మ‌న్నారు. తక్షణమే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. స‌ర్ ర‌ద్దు చేసేంతవరకు ఈ పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ రాస్తారోకోలో సువర్ణ, లీలారాణి, కె విజయలక్ష్మి, ఎం విజయలక్ష్మి, రాజేశ్వరి, సుజాత, తిరుమలేశ్వరి, జైనేని లక్ష్మి,కామెర బాబు, మొగిలి, బొల్లం రాజేశం, కే సూరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like