నీటి కుంటలో ప‌డి ముగ్గురు మృతి

మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో విషాదం నెల‌కొంది. గ్రామ సమీపంలోని చెరువు గుంతలో పడి ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఓ పాప మృత్యువాత ప‌డ్డారు. వీరంతా ఒడిస్సాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలో నీటి కుంటలో దిగి ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో మృతులను మణెమ్మ (24), కీర్తన(16), కావ్య(9)గా గుర్తించారు. బ‌ట్ట‌లు ఉతికేందుకు వెళ్లి కావ్య అందులో ఉన్న‌ గుంత చూసుకోకపోవ‌డంతో ప‌డిపోయింది. ఆమెను కాపాడేందుకు మిగ‌తా ఇద్ద‌రూ ప్ర‌య‌త్నించి వారు కూడా మృత్యువాత ప‌డ్డారు. వారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like