బార్ల యజమానుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం

బార్ల యజమానుల పట్ల ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు. బార్ల యజమానులు, కార్మికులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించి అధికారుల తీరుపై మండిపడ్డారు.

నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని బార్ల యజమానులు, కార్మికులు ఆరోపించారు. వైన్స్ పర్మిట్ రూమ్‌ల పేరుతో యథేచ్ఛగా సిట్టింగ్‌లు కొనసాగుతున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదని కాగజ్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని నిబంధనలు పాటిస్తూ పన్నులు చెల్లిస్తున్న బార్ల పట్ల మాత్రం ప్రభుత్వం వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమ మద్యం అమ్మకాలు, పర్మిట్ రూమ్ సిట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బార్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

You might also like