కాంగ్రెస్ ల‌క్ష్యం వంద సీట్లు

Telangana Congress: రాబోయే ఎన్నికల్లో వంద (100) స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తాందని, రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్య‌క్తం చేశారు.  మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్లో ఆయన రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలను విస్మరించి కేవలం భ్రమల్లో బతుకుతున్నారని వారికి గ్రౌండ్ రియాలిటీ అర్ధం కావడం లేదన్నారు. కేసీఆర్ (KCR) మేధావి అనుకుంటామని.. కానీ ఆలోచన లేకుండా అప్పులు చేయడంతో ఇప్పుడు ఆర్థికంగా భారమవుతోందని అన్నారు. దేశమంతటా ఎల్ నినో (El Nino) ప్రభావం ఉంటే హరీశ్ రావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, తెలంగాణలో అధికారంలోకి రావడమనేది సాధ్యం కాద‌న్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న 8 మంది బీజేపీ ఎంపీల్లో ఇద్దరు గెలవడమే ఎక్కువన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 శాతం సీట్లు తమకే రాబోతున్నాయన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉందని పీసీసీ చీఫ్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు పొందిన ప్రతి ఒక్క లబ్దిదారుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని చెప్పారు. ఇప్పటికే రైతులకు ఉచిత కరెంట్ అందిస్తూ, రికార్డు స్థాయిలో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ అభివృద్ధిని చూసే ప్రజలు మళ్లీ తమను ఆశీర్వదిస్తారని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటికీ నవంబర్ నాటికి పూర్తిగా పరిష్కారం దొరుకుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని.. ఎమ్మెల్యేలు యాక్టీవ్ అయ్యారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. తమ మధ్య అద్భుతమైన సమన్వయం ఉందన్నారు. నవంబర్ తరువాత తాము పూర్తిగా ఎలక్షన్ మోడ్లోకి వెళ్తామని.. అన్ని సమస్యలకు అప్పుడే పరిష్కారం దొరుకుతుందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు తాను కూడా చూసినట్లు వివరించారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు, ఉచిత కరెంట్, 90 వేల ఉద్యోగాలు పొందినవారు తమకు కచ్చితంగా ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు

You might also like