త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

దీపావ‌ళి పండ‌గ వేళ బంగారం, వెండి కొనాల‌నుకునే వారికి ఇది నిజంగా శుభ‌వార్తే.. బంగారం రేటు ఒక్క‌సారిగా కింద‌కు దిగింది. శుక్ర‌వారం ఒక్క రోజే దాదాపు రూ. 1,590 తగ్గింది. రానున్న పది రోజుల్లోనూ ధరలు భారీగా తగ్గే చాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలు, ముడి చమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకపు విలువ, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, వినియోగదారుల డిమాండ్‌లో మార్పులు వంటి అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ‘క్యాప్స్ గోల్డ్’ ప్రకారం, శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,45,260గా నమోదైంది. గ‌తం ధ‌ర‌తో రూ. 1,46,850 ధరతో పోలిస్తే రూ. 1,590 తగ్గింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు నమోదయ్యాయి.

ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,31,940గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో, బంగారం స్పాట్ ధర ఒక ఔన్సుకు 3,991 డాలర్లుగా ఉంది. వెండి ధరల్లో కూడా మార్పు వచ్చింది. గత ట్రేడింగ్ సెషన్‌లో కిలోగ్రాముకు రూ. 1,97,500గా ఉన్న వెండి ధర, శుక్రవారం రూ. 7,500 తగ్గి రూ. 1,90,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 51 డాలర్లుగా ఉంది.

వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గురువారం కిలో వెండిపై రూ.5వేలు తగ్గుదల చోటు చేసుకోగా.. ఇవాళ (శుక్రవారం) కూడా వెండి ధర మరో రూ.5వేలు తగ్గింది. మొత్తంమీద గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై రూ. 25వేలు తగ్గుదల చోటు చేసుకుంది. దీపావళి నాటికి మరింత తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,42,260 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,400 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,410 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,30,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,260కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,30,400 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,10,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,10,000 వద్ద కొనసాగుతోంది.

 

You might also like