తెలంగాణ‌లో ఎల్‌నినో ఎఫెక్ట్‌.. 23.40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం

తెలంగాణ‌లో ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పెద్ద ఎత్తున పంట‌లు ఎండిపోయాయి. రాష్ట్రంలో ఎల్‌నినో రైతుల‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ వేసిన ప్రాథ‌మిక అంచాన మేర‌కు 23.40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిన‌ట్లు గుర్తించారు. ఇందులో పత్తి 15 లక్షల ఎకరాలు, వరి 4 లక్షల ఎకరాలు, కందులు: 1,50,000 ఎకరాలు, మక్కలు 70,000 ఎకరాలు, మిరప 14,000 ఎకరాల్లో పంట‌లు ఎండిన‌ట్లు అధికారులు అంచ‌నా వేశారు.

జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మ‌డి న‌ల్గొండ‌, మ‌హ‌బూబున‌గ‌ర్ జిల్లాల్లో రైతులు ఈ ఎల్‌నినో ప్ర‌భావంతో తీవ్రంగా న‌ష్ట‌పోయారు. న‌ల్గొండ జిల్లాలో 3.58 ల‌క్ష‌లు, నారాయ‌ణ‌పేట 2.40 ల‌క్ష‌లు, సంగారెడ్డి 2.19 ల‌క్ష‌లు, జ‌న‌గామ 2 ల‌క్ష‌లు, నాగ‌ర్‌క‌ర్నూల్ 1.78 ల‌క్ష‌లు, రంగారెడ్డి 1.69 ల‌క్ష‌లు, మ‌హ‌బూబున‌గ‌ర్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో 1.54 ల‌క్ష‌లు, వికారాబాద్ జిల్లాలో 1.24 ల‌క్ష‌లు, భువ‌న‌గిరి జిల్లాలో 90 వేల ఎక‌రాల్లో పంట‌లు ఎండిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు.

మూడు రోజుల కింద‌టే రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. వీటిలో 111 తీవ్ర కరువు మండలాలు, 254 మధ్యస్థ కరువు మండలాలు ఉన్నాయని స్ప‌ష్టం చేసింది. ఈ వ్య‌వ‌సాయ సీజన్‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సుమారు 17 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం సైతం 139.28 లక్షల ఎకరాల నుండి 126.06 లక్షల ఎకరాలకు పడిపోయిందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం 69.19 లక్షల ఎకరాల నుండి 57 లక్షల ఎకరాలకు తగ్గిందని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

 

You might also like