కడెం ప్రాజెక్టు సాగునీరు బంద్

-తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టులోని నీటి నిల్వలు
-రైతులు సహకరించాలని కోరిన ఇరిగేషన్ ఈఈ

నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అధికారులు కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరాను ఈ నెల 7వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని సాగునీటి సరఫరాపై నీటిపారుదల శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను భవిష్యత్ అవసరాల కోసం రిజర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ నవంబర్ నెల నుంచి వేసవి ముగిసే వరకు ప్రాజెక్టు నీటిని కేవలం తాగునీటి అవసరాల నిమిత్తమే వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.

దీంతో ఈ నెల (నవంబర్) 7వ తేదీ నుంచి కడెం ప్రాజెక్టు ద్వారా సాగుకు అందించే నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కడెం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఈఈ (కార్యనిర్వాహక అభియంత) పి. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాగునీటి ప్రాధాన్యత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయకట్టు రైతులందరూ గమనించి, అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

You might also like