నెలకు మూడు మెడికల్ బోర్డులు ఎక్కడ…?
సింగరేణి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం… గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు నెలకు 3 మెడికల్ బోర్డు నిర్వహిస్తామని 100% ఇన్వాల్యుడేషన్ చెప్పిస్తామని హామీ ఇచ్చి కార్మికులను మోసం చేశాయని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి దుయ్యబట్టారు. శ్రీరాంపూర్ ఏరియాలోని CHPలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు బండి రమేష్ ఆధ్వర్యంలో బాయి బాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మెడికల్ బోర్డుల పేరుతో హామీ ఇచ్చి నెరవేర్చకపోవటం పట్ల కార్మిక వర్గం మీద వారికున్న చిద్ధ శుద్ధి ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతోందని సురేందర్ రెడ్డి అన్నారు.
గత నెలలో మెడికల్ బోర్డు పెట్టకపోవడం వల్ల హయ్యర్ రిఫరల్ కు వెళ్లిన కార్మికులకు,అనారోగ్యంతో, మెడికల్ సిక్ లో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి 100% ఇన్వాల్యుడేషన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న సుమారు 250 మంది డిపెండెంట్ లకు ఉద్యోగ నియామక పత్రాలను స్థానికంగా ఇవ్వాలని, కార్మికులకు నాణ్యమైన పనిముట్లు, పీపీఈ కిట్లను సమకూర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేంద్ర జాయింట్ సెక్రెటరీ పొగాకు రమేష్, బ్రాంచ్ కార్యదర్శి బుస్సా రమేష్,ఫిట్ సెక్రెటరీ అందే రాజకుమార్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ కాసారపు లక్ష్మణ్, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్ చారి, నాయకులు శ్రీనివాస్, ఓదేలు, సుమలత, గండి సమ్మయ్య, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు…