NHM ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

ఆందోళ‌న‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్,అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 రోజులుగా కొనసాగుతున్న శాంతియుత ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం వారు చేస్తున్న పోరాటానికి తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి తిప్పారపు సారయ్య స్పష్టం చేశారు.

కార్య‌క్ర‌మంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు హారిక రావు, మహిళా రాష్ట్ర నాయకురాలు నిషా, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాచకొండ సురేష్, లెనిన్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీవాణి, నాయకులు జహీర్ ఖాన్, రజిత, రాజశేఖర్, ప్రశాంత్, జ్యోతి, వసంత, కాసిపేట మండల అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

You might also like