సిద్దిపేట‌లో గెల్చినోళ్ల‌కు.. సీఎం బంప‌రాఫ‌ర్‌..

మీరు సిద్ధిపేట‌లో ఎమ్మెల్యేను గెలిపించండి… మీరు ఇక్క‌డ గెలిపించిన ఎమ్మెల్యేను మంత్రిని చేస్తానని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు. సిద్దిపేటలో సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. హరీశ్ రావు వార్డు మెంబర్ కూడా గెలవకుండా ఏకంగా ఎమ్మెల్యే అయ్యారన్నారు. హరీశ్ రావు చేయని కుట్ర లేదని, సిద్ధిపేటలో అభివృద్ధి అనేది జరగకుండా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. సోలిపేట రామలింగారెడ్డి, హరీశ్ రావు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా రామలింగారెడ్డి కుటుంబం పేదరికంలో బతుకుతుందన్నారు.

హరీశ్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్ధిపేట గడ్డ మీద కాంగ్రెస్ లేకుండా చేయాలని హరీశ్ రావు నిత్యం కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. బావకు వందల ఎకరాల ఫామ్ హౌస్ లు, రంగనాయకుల సాగర్ వద్ద హరీశ్ రావుకు ఫామ్ హౌస్ లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హరీశ్ రావు కు పిల్లనిచ్చిన హన్మంతరావుకు ప్రభుత్వ భూమి, హరీశ్ రావు బావమరిదికి హైదరాబాద్ లో కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలు పేదరికంలో బతుకుతుంటే, ఈ కల్వకుంట్ల కుటుంబానికి వేల కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ప్రాణాన్ని త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి పదేళ్ల కాలంలో ఒక్క పదవి అయినా ఇచ్చావా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరుల తల్లుల కడుపుకోత ను పట్టించుకున్నావా? అని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన వారికి పదవులు ఇచ్చి తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన వారికి ఏం పదవులిచ్చావని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

You might also like