“సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతా.. కోర్టులో తేల్చుకుంటా”
నిర్మల్ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఈడీ సోదాలు ముగిశాయి. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ నివాసంలో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు పూర్తయిన అనంతరం ఆమె మీడియా ముందుకు వచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలు, సోదాలపై తీవ్రంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు. ఎవ్వరినీ మోసం చేయలేదు. మిగతా ఎమ్మెల్యేలు చేసిన విధంగా నేను మోసం చేయలేదని రేఖా నాయక్ స్పష్టం చేశారు. నా ఒక్కదాని మీదకే ఈడీని పంపించారని… దీని వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారని, అది తనకు చాలా బాధగా ఉందన్నారు. నాకు బిజినెస్ నాలెడ్జ్ లేకుండా ఈ బిజినెస్ చేసి ఇప్పుడు బాధపడుతున్నానని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
తాను డబ్బులు కట్టేది ఉందని… ఈ ప్రభుత్వ కాలంలో వరిధాన్యం తీసుకోలేదన్నారు. కోర్టులో తేల్చుకుంటా. సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతానని సోదాల సమయంలో నా బీరువాలో రెండు వందల రూపాయలు ఉండేవి.. అవి నాకే ఇచ్చి వెళ్లారని రేఖానాయక్ వెల్లడించారు.