రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ విజయవంతం చేయండి
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాదు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాళం చిన్నారెడ్డి, నల్లల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పుస్పూర్ నర్సారెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ రాచకొండ సాగర్, జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు నారాయణ, అమృత్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోకల అనిల్ తదితరులు పాల్గొన్నారు.