కేంద్ర కేబినేట్ కీల‌క నిర్ణ‌యాలు ఇవే…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.19,934 కోట్ల విలువైన ఐదు భారీ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Information, Broadcasting Ashwini Vaishnaw) వెల్లడించారు.

• CIE తయారీ పర్యావరణ వ్యవస్థ (₹11,000 కోట్లు): నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల (CIE) దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ఎనిమిదేళ్ల పథకానికి ఆమోదం. షిప్-టు-షోర్ క్రేన్లు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు, హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్ల తయారీతో పాటు ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తారు.

• కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్ (₹4,288 కోట్లు): తమిళనాడులోని కామరాజర్ పోర్టులో పీపీపీ (PPP) పద్ధతిలో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి ఆమోదం. ఇది దక్షిణాది ఎగుమతి, దిగుమతి రవాణాకు తోడ్పడుతుంది.

• సిల్చార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం (₹2,014 కోట్లు): అసోంలోని సిల్చార్ (దోలూ వద్ద) కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి పచ్చజెండా ఊపారు.

• ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ పథకం (₹1,491 కోట్లు): తపాలా శాఖకు చెందిన భవనాలు, భూములు, ఇతర ఆస్తుల నిర్వహణ మరియు సమర్థ వినియోగం కోసం ఈ నిధులు కేటాయించారు.

• పోస్టల్ ఆపరేషన్స్ పథకం (₹1,141 కోట్లు): దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలు, మెయిల్, పార్శిల్ వ్యవస్థల ఆధునీకరణ రవాణా సామర్థ్యం పెంపు కోసం ఆమోదం తెలిపారు.

You might also like