వైభవంగా ఆరట్టు ఉత్సవం
ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు ఉత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులతో కలిసి స్వామివారి పల్లకీని మోస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు మరియు గురుస్వాములు వారికి సాంప్రదాయబద్ధంగా శాలువా, పూలమాలలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రవీంద్రనగర్ అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ ఊరేగింపు ద్వారా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ ఇంటింటికీ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతోందని పేర్కొన్నారు. నియమ నిబంధనలతో దీక్ష చేపట్టే భక్తులకు, ఆదిలాబాద్ ప్రజలందరికీ ఎటువంటి కష్టాలు కలగకుండా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, వార్డు కౌన్సిలర్ సూచిక మనోజ్ కాలనీ వాసులు ఉన్నారు.