ఫ్లాష్.. ఫ్లాష్.. బెంగళూరు ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
బెంగళూరు ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. కాచిగూడ టు బెంగుళూరు రైలు (Bangalore Express) కాచిగూడ నుంచి బెంగళురుకు వెళ్తున్న సమయంలో ఇంజిన్ చక్రాలు వద్ద మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్ యాకత్ పూర స్టేషన్ వద్ద రైలు ఆపివేశారు. ఆ మంటలు రైల్వే సిబ్బంది ఆర్పేశారు. దీంతొ పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి చక్రాల వద్ద రాపిడి వల్ల అప్పుడప్పుడు నిప్పు రవ్వలు ఎగిసిపడుతుంటాయి. కానీ, అవి పెద్ద సంఖ్యలో కావడంతో చక్రాల వద్ద మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.