చెత్త కుప్పలో ఆడ శిశువు మృతదేహం
తల్లి గర్భం నుంచి బయటపడి ప్రపంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్పకు చేరి విగతజీవిగా మారిందో పసికందు… అప్పుడే పుట్టిన పాపాయికి నిండు నూరేళ్లు నిండాయి. ఏ పాపం తెలియని ఆ పనికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో.. ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది…
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం చెత్తకుప్పలో దర్శనమిచ్చింది. జిల్లా కేంద్రంలోని బంగల్ పేట డంపింగ్ యార్డుకు చెత్త తరలిస్తున్న వాహనం నుంచి పసికందు మృతదేహం కిందపడిపోయింది. చెత్త సేకరించి తీసుకువెళ్తుండగా రోడ్డు పైన పడిపోయిన కవర్లో ఆ శిశువు మృతదేహం కనిపించింది. ఆసుపత్రుల నుంచి చెత్త సేకరించిన వాహనం నుంచి ఈ శిశువు మృతదేహం పడిపోయినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.