గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారు
హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బలిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ బీసీ మహిళ కాబట్టే అవమానిస్తున్నారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం దురదృష్టకరమన్నారు. పీకే డైరెక్షన్లో డ్రామా చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.