సింగరేణి విషయంలో కేసీఆర్ ఇలా చేశారేంటి…వైఎస్, బాబు బెస్ట్
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, చాడ వెంకట్ రెడ్డి
నిన్న సింగరేణి బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులలో వరస ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి, సింగరేణి సీఅండ్ఎండీ పరామర్శించి, ధైర్యం చెప్పకపోవడం సమంజసం కాదన్నారు. గతంలో సింగరేణిలో ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులకు ఓదార్చే వారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.