ఆదిలాబాద్లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు
కాశ్మీర్ ఫైల్స్ సినిమా నడుస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేయడం ఉద్రికత్త దారి తీసిన ఘన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ లో మ్యాట్నీ షో ఆట నడుస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు లేచి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మిగతా ప్రేక్షకులు వారిని చితకబాదారు. దీంతో నినాదాలు చేసిన ఇద్దరూ పరారయ్యారు. వీరిద్దరూ సీట్ నెంబర్ సి 7,8 లో కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, పోలీసులు మాత్రం తాగిన మత్తులో గొడవ జరిగిందని చెబుతున్నారు.