అసిఫాబాద్ జైలు నుండి ఖైదీ పరారీ
కుమ్రంభీం ఆసిఫాబాద్ : అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ నుండి ఓ ఖైదీ పరారయ్యాడు. అధికారుల కళ్లుగప్పి తప్పించుకోపోయిన అతడి కోసం గాలిస్తున్నారు. కుమ్రం రాజేష్ (38) అనే ఖైదీ పరారయినట్లు గుర్తించారు. రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెంగుబాయి గూడ గ్రామానికి చెందిన రాజేష్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు. ఈ రోజు ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ఖైదీలు జైల్ ఆవరణ లోని పిచ్చి మొక్కలు తొగిస్తున్నారు. ఇదే అదునుగా భావించి రాజేష్ పరారయ్యాడు.