మా ఆవిడ ఇంట్లో లేదు… వచ్చేయ్
-సెక్స్ మీద నీ ఒపినియన్ ఏంటి..?
-నీకు ఫీలింగ్ రాకుంటే నేను తెప్పిస్తా
-పరీక్షలు రాయకున్నా పాస్ చేయిస్తా
-ఇదీ ఓ కీచక ఎస్ఐ రాసలీలలు ఇవీ
-పోలీసులకు దగ్గరకు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు
మంచిర్యాల : రక్షక భటులే భక్షక భటులు అవుతున్నారు… పేదరికం, అసహాయతను ఆసరగా చేసుకుని మహిళలను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ యువతని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతికి ఆ ఎస్సై ఫోన్ చేసి ఠాణాకు పిలిపించాడు. ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం.. పుస్తకాలు ఇస్తానని చెబితే వెళ్లాను.. సాయంత్రం ఆరు గంటలకు రా… ఇస్తానని చెప్పడంతో నేను వెళ్లలేదు. మళ్లీ తెల్లారి రమ్మన్నాడు.. ఉదయం పది గంటలకు వెళ్లాను. వెళ్లగానే సెక్స్ మీద నీ ఒపినియన్ ఏంటి అని అడిగాడు. పుస్తకాలు ఇస్తా ఇంటికి రమ్మనడంతో వెళ్లాను. ఇంటికి వెళ్లడంతో నీ హైట్ చూస్తానని చెప్పి నడుం పట్టుకున్నాడు. ప్రైవేటు పార్టులపై చేతులు వేశాడు. అంతేకాకుండా ఛాతీ మీద చేతులు వేసి ఇబ్బందులు పెట్టాడు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చా. రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ డైరెక్టర్ గా వచ్చేయ్ అంటూ మాట్లాడారు. నీకు ఫీల్ రాకుంటే నేను తెప్పిస్తానని అన్నారు. పరీక్షలు రాయకున్నా పాస్ చేయిస్తా అని చెప్పారు. తెలిసిన వారికి చెబితే బయటకు చెప్పద్దు అని చెప్పారని కన్నీటి పర్యంతమైంది ఆ యువతి.
తనకు జరిగిన యువతి సమీప బంధువుల దగ్గర ఈ విషయం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో వారంతా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు ఎస్సైపై కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలిసింది.