మంచిర్యాలలో ఏటీఎం చోరీకి య‌త్నం

Attempt to steal ATM in Mancharyal: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నం బట్టివాడలో దుండగులు ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం మిషన్ కు సంబంధించి పైన, కింది భాగాన్ని ఓపెన్ చేశారు. అందులో లాకర్ ఓపెన్ కాకపోవడంతో దానిని అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఏటీఎంకు సంబంధించిన సైరన్ మోగలేదు. అయితే ఇది తాగుబోతుల పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సిసి కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.

You might also like