బీఅర్ఎస్ నేత, గాయకుడు సాయి చంద్ మృతి

Singer Sai Chand:ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్ళారు ఆయన. అక్కడే అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు చికిత్స కోసం నాగర్ కర్నూల్ గాయత్రి ఆసుపత్రికి తీసుకొచారు. గుండెపోటుతో గాయత్రి ఆస్పత్రిలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు కుటుంబసభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు సాయిచంద్ మృతిని నిర్ధారించారు.
సాయి చంద్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేశారు. ఇప్పటివరకు అనేక పాటలు పాడారు. అందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.