భూ తగాదాలతో ఆత్మహత్యాయత్నం
Telangana: తగాదాల నేపధ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయటంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం తహసిల్దార్ కార్యాలయం అవరణలో మంగళవారం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇడిదినేని వెంకటేష్ ఆయన సోదరులకు తాండూర్ శివారులో భూమి ఉంది. తాతల నాటి భూమి పంపకాలలో వెంకటేష్ అన్న లచ్చయ్య రెండు ఎకరాల భూమి అన్నదమ్ములకు తెలియకుండా ఇతరులకు అమ్మాడు. తాము అభ్యంతరం తెలిపిన కూడా వినకుండా కొనుగోలు చేస్తున్నారని వెంకటేష్ అవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టిచుకొలేదని స్పష్టం చేశారు. మంగళ వారం ఆ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెల్సుకున్న వెంకటేష్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకు ముందు లేఖ రాసిన వెంకటేష్ తాను చనిపోతే దానికి తన సోదరుడు లచ్చయ్యతో పాటు సిద్దం శంకరయ్య, ఒడ్నాల బాపు కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు.