విద్యా సంస్థలకు సెలవులు

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. శుక్ర, శనివారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలను సైతం మూసివేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఎడతెగని వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శుక్ర, శనివారాలు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. రానున్న రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రైవేటు కార్యాలయాలు కూడా సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వర్షాల కారణంగా రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ ఏర్పతుండడంతో సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.