ఉద్యమకారుడి పాడె మోసిన విప్
Balka Suman: తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు మృత్యువాత పడటంతో ఆయన పాడె మోశారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఎరినాగుల మల్లికార్జున్ మంగళవారం అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మల్లికార్జున్ పాడె మోశారు.