మీ కోస‌మే షీ టీం, భ‌రోసా కేంద్రాలు

నాంది, కాగ‌జ్‌న‌గ‌ర్

మ‌హిళ‌లు, విద్యార్థినుల కోస‌మే షీ టీమ్‌, భ‌రోసా కేంద్రాలు ఉన్నాయ‌ని భరోసా టీం ఇంచార్జ్, ఎస్ఐ తిరుమల అన్నారు. మంగ‌ళ‌వారం పెంచికల్ పేట్ కేజీబీవీ పాఠశాల బాలబాలికలకు జిల్లా భరోసా టీం , కాగజ్‌న‌గ‌ర్ డివిజన్ షీ టీం ద్వారా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల మాట్లాడుతూ బాల‌బాలిక‌లు ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్లాల‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న స‌మాజంలో ప‌రిస్థితుల‌పై పూర్తి అవ‌గాహ‌న‌తో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. మొబైల్ ఫోన్స్ ద్వారా లాభం ఎంత ఉందో..? న‌ష్టం కూడా అంతే ఉంద‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. మహిళలపై హింస, ఈవ్టీజింగ్ కు ఎవరైనా గురి అయితే వెంటనే షీటీం సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల అయినా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విష‌యాలు ఎవ‌రితోనూ పంచుకోకుడ‌ద‌ని హెచ్చ‌రించారు.

బాలబాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ ట‌చ్‌, ఫోక్సోచట్టం, అమలులో ఉన్న శిక్షలు, బాల్య వివాహ నిరోధక చట్టం గురించి వివరించారు. అత్యాచార బాధితులు భరోసా సెంటర్ ఎలా ఆశ్రయించవచ్చు వారికి భరోసా సెంటర్లో లభించే సదుపాయాలు, సేవల గురించి వెల్ల‌డించారు. ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. భరోసా నెంబర్ 8712670561, కాగ‌జ్‌న‌గర్ సబ్ డివిజన్ షీ టీం నెంబర్ 87126 70565 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 సంప్రదించాలని భరోసా లీగల్ అడ్వైజర్ స‌మిండ్ల‌ శైల‌జ తెలిపారు. కార్యక్రమంలో షీటీం సభ్యులు రమాదేవి, సునీత, బండి శ్రీ‌నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like