మొక్కు కోసం రెండు కిలోల నువ్వుల నూనె తాగింది

Khandev fair: సంప్రదాయం, ఆచార వ్యవహారాలకు ఆదివాసీ గిరిజనులు అదిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. మండల కేంద్రమైన నార్నూర్‌లో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తోడసం వంశస్థులు పూజలు చేసి డోలు వాద్యాల మధ్య పూజలు ప్రారంభించారు.
తొడసం వంశానికి చెందిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ. తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకోవచ్చిన నువ్వుల నూనె సేకరిస్తారు. రెండు కిలోల నూనెను దేవుని సన్నిధిలో సోమవారం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశం ఆడపడుచు. మెస్రం నాగోబాయి తాగి తమ మొక్కును తీర్చుకుంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని ఈ వంశం వారి నమ్మకమని తొడసం వంశస్థులు తెలిపారు.
తొడసం వంశీయుల అడపడుచు ఆమె ఇలా రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఇది మూడోసారి. జాతర సందర్భంగా ఖాందేవ్ దేవతకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి , మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు, తొడసం వంశీస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.