రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కోరమాండల్ వైస్ ప్రెసిడెంట్ GV సుబ్బారెడ్డి అన్నారు. ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో RO వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో అన్ని వృత్తులు అష్టదిగ్బంధంలో ఉంటే కేవలం ఒక రైతులు మాత్రమే అలుపు లేకుండా శ్రమించి దేశానికి అన్నం పపెట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ భారతం బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో కోరమాండల్ గ్రోమోర్ సంస్థ గ్రామీణ పాఠశాలలను ఎంపిక చేసుకొని తాగునీతి వసతికి ఆర్ఓఆర్ ప్లాంట్లని ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు చదివితేనే వారి భవిష్యత్తు బాగుంటుందని, వారు చదువు మీదనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధ్యాయులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధి దాని ఆవశ్యకత గురించి విద్యార్థులకి వివరించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 100కు పైగా ఆర్‌వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామీణ బాలికల ప్రతిభ పురస్కారం ,బాలికల ఉన్నత విద్య కోసం కంపెనీ అందిస్తున్న సేవలని, గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, మొక్కలు నాటడం, విద్యార్థులకి ప్రేరణ కలిగించే అంశాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి కోరమాండల్ సంస్ధ రైతులకి చేస్తున్న సేవలు CSR కార్యక్రమాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు ఛాయాదేవి, ఉపాధ్యాయులు అరుణ, అంజయ్య సీనియర్ అగ్రనామిస్ట్ వినోద్, జిల్లా మార్కెటింగ్ అధికారి రాహుల్, పృధ్వి డీలర్లు కిషన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.