నిమజ్జనంలో అపశృతి.. ఒకరి మృతి
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తుండగా ఒక మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతు వాత పడ్డాడు. జిల్లాలోని కాగజ్ నగర్ మండలం పెద్దవాగులో నిమజ్జనాలు జరుగుతుండగా క్రేన్ సహాయంతో వినాయకుని దింపే క్రమంలో క్రేను టైరు కిందపడి ఇద్దరి మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలయ్యాయి. నగేష్(46) అనే కార్మికుడి రెండు కాళ్లకు తీవ్రగాయాలు కాగా, మరో కాంట్రాక్టు కార్మికుడు ప్రేం (33)కు స్వల్ప గాయాలు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సందర్శించారు. లింగంపల్లి నగేష్ ను హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో కరీంనగర్ వద్దకు చేరుకోగానే పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది నిమజ్జనం పనులను బహిష్కరించారు.