కొన‌సాగుతున్న ఇంటింటీ స‌ర్వే

వంద శాతం టీకాలు ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌లు ర‌కాలైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. దీనిలో భాగంగా గ‌ర్భిణులు బాలింత‌లు టీకా వేసుకునేందుకు ముందుకు రావ‌డం లేద‌ని గ్ర‌హించి వారికి సైతం టీకాలు వేసేలా అధికారులు చూస్తున్నారు. అధికారులు, అంగ‌న్‌వాడీ సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహన క‌ల్పిస్తున్నారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో గురువారం అధికారులు స‌ర్వే నిర్వ‌హించారు. అంగ‌న్‌వాడీ కుశ్న‌ప‌ల్లి మీనా, అన‌సూయ త‌దిత‌రులు ఇంటింటికి వెళ్లి స‌ర్వే చేశారు. ఖ‌చ్చితంగా టీకాలు వేసుకోవాల‌ని ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించారు.

You might also like