దీపావళి బోనస్ @ రూ. 93,750
బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ. 93,750 చెల్లించనున్నారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ ఏటా పండుగకు కోలిండియా, సింగరేణి సంస్థలు బోనస్ ఇస్తాయి. ఆదివారం ఢిల్లీలోని జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గుగనుల యాజమాన్యాల అధికారుల స్టాండనైజేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొగ్గు కార్మికులకు సీఎస్ఆర్ బోనస్ కింద ఈ ఏడాది రూ. 93,750 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. గత ఏడాది రూ.85,500 చెల్లించిన బోనస్ కు అదనంగా ఈ ఏడాది మరో రూ. 8.250 పెంచారు. మొత్తం రూ. 93,750 వేలుగా బోనస్ నిర్ణయించారు. దేశవ్యాప్తంగా కోలిండియాలో పనిచేస్తున్న 2.5 కోట్ల మందితో పాటు సింగరేణిలోని 42 వేల మంది కార్మికులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కింది.
రాత్రి పొద్దు పోయే వరకు ఈ చర్చలు కొనసాగాయి లక్ష రూపాయల బోనష్ కావాలని కార్మిక సంఘాలు పట్టుబబ్టాయి. ఈ నేపథ్యంలో అధికారులు గతేడాది కంటే రూ. 8 వేలు అదనంగా ఇచ్చేందుకు కార్మిక సంఘాలను ఒప్పించాయి. ఈ బోనస్ కోల్ఇండియాలో దసరాకు ముందు, సింగరేణిలో దీపావళికి ముందు చెల్లిస్తారు. దీనిని ఎప్పుడు చెల్లించేది సింగరేణి యాజమాన్యం త్వరలో తేదీ ప్రకటించనుంది.