IIIT ఇన్ చార్జి వీసి పై కరపత్రం కలకలం

బాసర పలు ఆరోపణలతో IIIT ఇన్చార్జి వీసిపై విడుదల చేసిన కరపత్రం కలకలం సృష్టిస్తోంది. పలు ఆరోపణలతో కూడిన ఈ కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ జేఎసీ పేరిట దీనిని విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ తో పాటు ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీగా కొనసాగుతూ, పేద విద్యార్థులకు చెందాల్సిన డబ్బులు కాజేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్లోని కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని, ట్రిపుల్ ఐటీ ఉద్యోగులుగా లక్షల జీతం ఇస్తూ అక్రమాలకు తెర లేపారని ఆరోపించారు. ఆయన విద్యార్థులు, మహిళా ఉద్యోగులను వేధిస్తాడనే ఆరోపణలు సైతం చేయడం గమనార్హం.