మంచిర్యాలలో పులి సంచారం

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం కలవరం కలిగిస్తోంది. హాజీపూర్ మండలం బుగ్గు గట్టు రాపెల్లి మామిడి తోట సమీపంలో మేకల మంద పై పులి దాడి చేసింది. మేకను చంపి మరో మేకను ఎత్తుకొని వెళ్ళింది. పులిని చూసిన మేకల కాపరి భయంతో పరుగులు తీశాడు.దాడి చేసింది పులే అని చెప్తున్నాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పాద ముద్రలు పరిశీలిస్తున్నారు.