రైతులపై థర్డ్ డిగ్రీ.. చర్యలు తీసుకోండి
Sirpur:అటవీ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ లో మంత్రి కొండా సురేఖని కలిసి ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ రేంజ్ ఆఫీసర్ రెబ్బెన సెక్షన్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి సిర్పూర్ మండలానికి చెందిన ఏడుగురు రైతుల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేంజర్, సెక్షన్ ఆఫీసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సోమవారం నుండి సిర్పూర్ నియోజక కేంద్రంలో రైతులతో కలిసి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
సిర్పూర్ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు దాష్టీకాలకు అంతేలేకుండా పోతుందని, అడ్డగోలు అవినీతి, అక్రమ సంపాదనకు మరిగి రైతుల దగ్గర నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే వెల్లడించారు.