కాంగ్రెస్ నేతలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు
The leaders of the Congress were shell-shocked: కుర్చీలు గాల్లోకి లేచాయి.. నేతలు, కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు.. పిడిగుద్దులు, రా అంటే రా అని సవాళ్లు ప్రతి సవాళ్లు ఇదేదో యుద్ధ క్షేత్రం కాదు.. కాంగ్రెస్ మీటింగ్ మాత్రమే.. బీసీ కుల గణన కార్యచరణ ప్రణాళికలో భాగంగా కార్యకర్తలు, నేతల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లాలో బీసీ కుల గణన కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ రోజ్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడుతున్న క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జిల్లా అద్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ వర్గాల మద్య రచ్చ మొదలయ్యింది.
తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని శ్యామ్ నాయక్ వర్గం ఆరోపించింది. తాము అందరికీ సమాచారం ఇచ్చామని విశ్వప్రసాద్ వర్గం చెప్పడంతో గొడవ మొదలైంది. సమావేశంలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలతో గందర గోళ పరిస్థితి ఏర్పడింది. డీసీసీ అధ్యక్షున్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ రోడ్డుపై బైఠాయించారు. లోపల సమావేశం, బయట ఆందోళన మద్య సమావేశం సాగుతోంది. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.