జనారణ్యం నుంచి.. అభయారణ్యంలోకి..
Tiger: కొద్దిరోజులుగా జనావాసాల్లో తిరుగుతున్న పెద్దపులి ఎట్టకేలకు అభయారణ్యంలోకి వెళ్ళింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన పులి రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటడంతో వాహనదారులు తమ వాహనాలు ఎక్కడిక్కడ నిలిపివేశారు. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. కారు, లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్లు చూసి అధికారులకు సమాచారం అందించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పులి రోడ్డు దాటింది. ఈ పులి కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లాలో సంచరిస్తోంది. పులి కవ్వాల్ అభయారణ్యం (K awal Tiger Sanctuary)వెైపు మళ్ళినట్లు చెబుతున్నారు.