TBGKS డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సిరిశెట్టి

TBGKS:తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సిరిశెట్టి సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు.

తన నియామకం పట్ల ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ కి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందు ఉంటానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తన నియామకం కోసం సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ఆయన మరోమారు ధన్యవాదాలు తెలిపారు.

You might also like