టీటీడీ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యాలు

TTD Board : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి మొద‌టిసారిగా స‌మావేశ‌మై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణ‌యాలు తీసుకున్నారు. సామాన్య భ‌క్తుల‌కు రెండు, మూడు గంట‌ల్లో ద‌ర్శ‌నం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అన్య‌మ‌తస్తుల‌ను ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేసేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. వారు వీఆర్ఎస్ తీసుకుంటే వీఆర్ఎస్ ఇస్తారు. లేకపోతే ఇతర శాఖలకు బదిలీ చేస్తారు. తిరుపతిలోని శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చినట్లు చెప్పారు. 20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్ట్ ఇచ్చారన్న టీటీడీ ఛైర్మన్. ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. అయితే ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. శారదా పీఠం లీజు రద్దు చేసింది.

పర్యాటకం దర్శన టికెట్లు రద్దు
తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను మూడు నెలల్లోనే తొలగించ‌నున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా నిషేధం విధించాలని నిర్ణయించామన్నారు. టీటీడీ చెందిన నగదును ప్రైవేటు బ్యాంకుల్లో నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామన్నారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్‌ నాయుడు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like