ముత్తూట్ మనీ సిబ్బంది నిర్వాకం.. బాధితుడి లబోదిబో
Muthoot money: ముత్తూట్ మనీ సిబ్బంది చేసిన నిర్వాకం బాధితున్ని ఆందోళనకు గురి చేస్తో్ంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ముత్తూట్ మనీలో నెన్నల మండలం మైలారానికి చెందిన కౌటారపు రాజేందర్ అనే వ్యక్తి తన బంగారు నగలు తాకట్టు పెట్టాడు. 14 తులాల బంగారు నగలు తాకట్టు పెట్టగా, దానికి సంబంధించి రూ. 7.35 లక్షల రూపాయలు వస్తాయని సిబ్బంది చెప్పారు. నగదు వెంటనే ఖాతాల పడతాయని చెప్పగా నాలుగు రోజులుగా డబ్బులు పడటం లేదు. తన ఖాతాలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జమ కావడం గమనార్హం. ముత్తూట్ మనీ సిబ్బంది సాంకేతిక సమస్య కారణంగా డబ్బులు పడటం లేదని చెబుతున్నారు. నాలుగురోజులు అయినా ఖాతాలో నగదు జమ కాకపోవడంతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. మరి నిజంగానే సాంకేతిక సమస్య నెలకొందా..? లేక సిబ్బంది ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.