తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold And Silver Price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 650 తగ్గగా, 22 క్యారట్ల బంగారం రూ. 600 తగ్గింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గుదల చోటుచేసుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,900కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,350 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,050 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,500.ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.70,900 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,350, చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,900 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 77,350 వద్ద కొనసాగుతోంది.
సోమవారం వెండి ధర సైతం తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.99,500 కాగా, చెన్నైలో కిలో వెండి ధర రూ. 99,500, కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,000, బెంగళూరులో సైతం కిలో వెండి ధర 91,000 వద్ద కొనసాగుతోంది.