తండ్రిని హ‌త్య చేసిన త‌న‌యుడు

Murder: కుటుంబ క‌ల‌హాల‌తో క‌న్న‌తండ్రిని కొడుకే హ‌త్య చేసిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా ఇందారంలో చోటు చేసుకుంది. ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య(48) ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం అర్ధ‌రాత్రి తండ్రి రాజ‌య్య‌ను కొడుకు సాయి సిద్ధార్థ్ (సిద్దు) కత్తితో గొంతు కోసి చంపాడు. అత‌నితో పాటు ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు స్నేహితులు కూడా పాల్గొన్న‌ట్లు స‌మాచారం. తండ్రి రాజయ్య తల్లిని వేధించడం,అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో ఈ హత్యకు దారి తీసిందని ప‌లువురు చెబుతున్నారు. తండ్రిని హ‌త్య చేసిన త‌ర్వాత నిందితుడు స్థానిక జైపూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు పోలీసులు పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టారు.

You might also like