ఇస్రో సెంచ‌రీ

ISRO : ఇస్రో (ISRO) వందో రాకెట్ ప్రయోగం విజ‌య‌వంతం అయ్యింది. తిరుపతిలోని శ్రీహరి కోట వేదికగా జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 (GSLV F15) రాకెట్‌ను ప్రయోగించారు. ఉదయం 6:23 గంటలకు నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఈ శాటిలైట్ స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది. నావిగేషన్ శాటిలైట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని, ఈ వందో ప్రయోగం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

ఎన్వీఎస్-02ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు ఉంటుంది. ఇది కొత్తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ప్రయోగం విజయవంతం తరువాత ఇస్రో చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్వీఎస్-02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుందని చెప్పారు. ఇస్రో ఆధ్వర్యంలో 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలోని తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు ఇస్రో చరిత్రలో 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపామని పేర్కొన్నారు. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది తొలి ప్రయోగం కావడంతో ఆయనే అన్ని ప్రక్రియలనూ స్వయంగా పర్యవేక్షించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like