తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల‌ హల్చల్..!

Telangana Secretariat:తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల‌ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. సచివాలయంలో ఒక వ్యక్తి ఫేక్ ఐడీతో దొరికాడు. తను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆ వ్యక్తిపై నిఘా పెట్టారు. వారి అనుమానం నిజమే అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్‌రావు అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. సెక్రటేరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని,ఫైల్ క్లియర్ చేయిస్తామని,ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు గుర్తించారు.

వీరికి స‌హ‌క‌రించింది ఎవ‌రు..?
సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజునే భాస్క‌ర్ రావు ఎస్పీఎఫ్ కు పట్టుబడ్డాడు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి..భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించిన ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. భాస్క‌ర్‌రావుతో పాటు డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డు తో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవి ని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సైఫాబాద్ పోలీసులు ఏ1గా భాస్కర్ రావు..ఏ2 గా డ్రైవర్ రవిని చేర్చారు. ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు..ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా.. సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది..? వీరికి ఎవరు సహకరించారు? వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచార‌ణ సాగిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like