గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Head constable died of heart attack: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృత్యువాతపడిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. చెన్నూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్‌పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య (55 ) గుండెపోటుతో మృతి చెందాడు. పోలీస్ స్టేషన్ లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, తనుఅప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీసు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.