బైక్‌లో నుంచి నగదు చోరీ

Theft in Nirmal : బైక్ సైడ్ బాక్స్‌లో ఉంచిన నగదు చోరీ చేశాడో దుండగులు… నిర్మల్ పట్టణం మయూరి హోటల్ వద్ద జరిగిన దొంగతనం వివరాలు ఇలా ఉన్నాయి… లక్ష్మణ్ చాందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగ నరేష్ అనే వ్యక్తి తన అల్లుడితో కలిసి మయూరి హోటల్ ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్ వద్దకు మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో వెళ్లారు. అక్కడ నరేష్ అకౌంట్‌లో నుంచి రూ. 5 లక్షలు డ్రా చేసుకుని తీసుకువచ్చారు. నరేష్ తన అల్లుడైన కళ్యాణ్‌కు ఆ డబ్బులు ఇచ్చాడు. కళ్యాణ్ ఆ డబ్బులను బైక్ సైడ్ బాక్స్‌లో పెట్టాడు. ఇంతలోనే ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడాడు. బైక్ స్టార్ట్ చేసే సమయంలో చూడగా డబ్బులు కనిపించలేదు. దీంతో నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు 3.27 గంటల సమయంలో ఓ వ్యక్తి తన బైక్‌లో ఉన్న డబ్బులు దొంగిలించాడని తనను ఎవరో వ్యక్తులు వెంబడించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్ వద్ద జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ రాజేష్‌మీనా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొంగని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.