రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి

Female SI dies in road accident: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా చిల్వకోడూరులో చోటు చేసుకుంది. మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత గొల్లపల్లి నుంచి జగిత్యాల వస్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆమెతో పాటు బైక్ పై వస్తున్న వ్యక్తి సైతం మృత్యువాత పడ్డాడు. ఇద్దరి శవాలను పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.