పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు

పేకాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేట మండలం మోదెల గ్రామం పత్తి చేన్లలో పేకాట ఆడుతున్నారన్న విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్, ఎస్ఐలు ఉపేందర్, లచ్చన్న, సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకుని వారి వద్ద నుండి 13,120 రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రావుల రవి (గంపలపల్లి, లక్షేట్టిపేట్), తనుగుల ప్రశాంత్ (గంపలపల్లి, లక్షేట్టిపేట్), ఎగ్గడి సత్తయ్య (గంపలపల్లి, లక్షేట్టిపేట్)లను అదుపులోకి తీసుకోగా, రావుల మహేష్, బలరాం, నల్లాపు తిరుపతి, రమేష్, కుమ్మరి మహేష్ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.